పొట్ట తగ్గాలంటే.. ఉదయాన్నే వీటిని తాగండి..!

Mar 5,2024 15:36 #Father, #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : గంటల తరబడి వ్యాయామాలు చేసినా.. పొట్ట తగ్గడం లేదా? అయితే ఉదయాన్నే వీటిని తాగితే.. పొట్ట తగ్గే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..?!

మెంతులు : ఒక అర టీ స్పూన్‌ మెంతుల్ని ఒక గ్లాసు నీటలో నానబెట్టి.. పొద్దున్నే ఆ నీటిని తాగితే మంచిది. ఈ నీరు శరీరంలోని అధిక కొవ్వును తగ్గించేందుకు దోహదపడతుంది.

అల్లం – పసుపు : పసుపు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఒక కప్పు నీటిలో కొద్దిగా పసుపు, అల్లం ముక్కలు వేసి కొద్దిసేపు మరిగించి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి మంచిది. అల్లం అజీర్తి సమస్యలను నివారిస్తుంది.

యాపిల్‌ : ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, కొద్దిగా తేనె కలుపుకుని తాగితే.. అధిక బరువు తగ్గే అవకాశం ఉంది అని వైద్యులు చెబుతున్నారు.

దాల్చినచెక్క : ఒక కప్పు నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క వేసి మరిగించి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకోవాలి. తాగేముందు ఒకటిరెండు తులసి ఆకులు వేసుకుని తాగితే.. సువాసనతోపాటు ఆరోగ్యకరం కూడా.

➡️