నేనెవరో కనుక్కో!

Mar 31,2024 10:53 #Sneha

ఆట ఆడుకుందామా!
ఒక క్లాసులో ఉన్న పిల్లలతోగానీ లేదా వీధిలో గుంపుగా ఆడుకుంటున్న ఐదారు ఏళ్ల పిల్లల చేత ఈ ఆట ఆడిస్తే బాగుంటుంది. ఆట పేరు ‘నేనెవరో కనుక్కో.’.
ఎలా ఆడాలంటే? : పిల్లల్ని రెండు గ్రూపులుగా చేయాలి. ఒక గ్రూపుకు ఎదురుగా మరొక గ్రూపును నిలబెట్టాలి. మొదటి గ్రూపువారు వెనక్కి తిరిగి నిలబడాలి. రెండో గ్రూపులో ఒకరు ఏదైనా ఒక శబ్దం (కొక్కొరోక్కో, భౌ భౌ, బెక్‌ బెక్‌…) చేస్తారు. మొదటి గ్రూపువారు ఆ శబ్దం చేసింది ఎవరో కనుక్కోవాలి. ఇలా రెండో గ్రూపు కూడా చేయాలి. ఏ గ్రూపుకు ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్లు గెలిచినట్లు. ఈ ఆట వల్ల పిల్లల్లో గ్రహింపు శక్తి పెరుగుతుంది. ఎవరి గొంతు ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవడం వల్ల మెదడు చురుకుదనం అవుతుంది. మరి ఆట ఆడుకుందామా!

➡️