ఇంటి పనులు

May 5,2024 08:55 #Sneha

నేను ఎప్పుడూ, ఇంటి పనికి పెద్ద విలువ ఇవ్వలేదు. ఈ అమ్మల వెర్రి ప్రేమల పుణ్యమాని, పని అలవాటు కాదు కదా, అసలు పని స్పెలింగ్‌ కూడా తెలీకుండా పెరిగేసాను నేను. కానీ ఇలాగే సాగనిస్తుందా కొంటె సమయం, అందరికీ ఓ రోజు వస్తుంది, నాకూనూ.
ఆ ఏముందిలే, ఫుడ్‌ బయట నుండి తెప్పించేస్తా, ఇంక పెద్దేం పనుంటుంది అనేసుకున్నా సులువుగా. అనుకుని ఇలా వచ్చి బెడ్‌షీట్‌ వేసేలోపే ప్రాణం పోయింది. అటు లాగితే ఇటు, ఇటు లాగితే అటు బయటకి వచ్చేస్తుంది. దానితో యుద్ధం చేసి బాగా తిట్టి మడిచి ఏదో పెట్టా అంచులకి.
బట్టలు పిండడం మజిల్‌ వర్కౌట్‌,
వాటిని ఆరేయడం ఆర్మ్‌ టోనింగ్‌,
గిన్నెలు తోమడం ఆర్మ్‌ అండ్‌ బ్యాక్‌ స్ట్రెంథెనింగ్‌,
ఇల్లు తుడవడమైతే హై-ఇంటెన్సిటీ ఫుల్‌ బాడీ వర్కౌట్‌,
బాత్రూం క్లీనింగ్‌, రేస్పాన్సిబులిటీ నేర్పిస్తుంది,
వంట చెయ్యడం మెమొరీ, క్రియేటివిటీ, ముఖ్యంగా సహనం ఇంప్రూవ్మెంట్‌.
పాల ప్యాకెట్‌ తీసి, కట్‌ చేసి కాచడం నుండి, బాటిల్స్‌ నింపడం దాకా ప్రతీ పనీ పనే. ఉన్న వందల వేల పనుల్లోంచి, నేను చేసినవి ఈ కొన్ని మాత్రమే. ఏదో అనుకున్నా కానీ అన్నీ చేసేసరికి మడతడిపోద్ది, ఆరు, మరే మామూలుగా కాదు! ఇంకా అప్పటి పిండి రుబ్బడాలు, నీళ్ళు తోడ్డాల గురించి మాటే భయమేస్తోంది.
ఇదే, నాకు, ఇంటి పనికి ఏర్పడిన హఠాత్తు పరిచయం, వద్దనలేని బంధం. మొదట కష్టపెట్టేసి తాట తీసేసినా, తరువాత తరువాత కూడా ఏం సులువయిపోలేదు. అలవాటు అయిపోయిందంతే. ఈ ఇంటిపని అనే ప్రయాణంలో నేను “I would never do that, one need not do itw” qT+& “One has to do it” nq• mindset అన్న దాకా వచ్చాను. బద్ధకానికీ, తోచక వచ్చిన నా అన్ని బాధలకీ ఫుల్‌స్టాప్‌గా వచ్చింది ఇంటిపని. ఎన్ని కష్టాలున్నా, ఏ సుఖాలు, మంచి బట్టలు, పెద్ద ఉద్యోగం, లేని అమ్మ సదా చిరునవ్వు వెనకున్న ఇంటి పని, ఇప్పటికి నాకు పరిచయం అయ్యింది.

సాయి మల్లిక పులగుర్త
mallika.quill@gmail.com

➡️