యాక్షన్‌ సినిమాలు నాకు బాగా నప్పుతాయి!

May 5,2024 08:16 #selebriti

తెలుగులో 2021లో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. ‘నక్షత్ర’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఆమె ఎవరో కాదు.. మనందరినీ మురిపించే చిట్టి.. ఫరియా అబ్దుల్లా.. అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ నెల మూడవ తేదీన విడుదలైంది. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రాజీవ్‌ చిలక నిర్మాత. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలను, మరికొన్ని అభిప్రాయాలను పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే..
‘భవిష్యత్‌లో టిపికల్‌ హీరోయిన్‌గా మాస్‌ మసాలా సినిమా చేయాలని వుంది. అలాగే హారర్‌ థ్రిల్లర్‌ చేయాలని వుంది. అలాగే కామెడీ సినిమా చేయాలని వుంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్‌ సినిమాలు చేసే హీరోయిన్స్‌ తక్కువగా వున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని వుంది. యాక్షన్‌ సినిమాలు నాకు బాగా నప్పుతాయని భావిస్తున్నాను. నేను ఏదైనా పాత్ర చేసేటప్పుడు.. ఆ పాత్ర ప్రాధాన్యత, నిడివి అన్నీ చూస్తాను. కొన్ని క్యామియో రోల్స్‌ కూడా చేశాను.
రవితేజ గారితో వర్క్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. రావణాసురలో అవకాశం వచ్చింది. అది హీరోయిన్‌ పాత్ర అని చెప్పలేను. కానీ ఆ పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. జాతిరత్నాలు 2 నిర్మాతలు ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌ కె’ లో బిజీగా వున్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్‌. కల్కి కోసం నేనూ ఎదురుచూస్తున్నాను. కల్కి విడుదల తర్వాత జాతిరత్నాలు 2 కోసం ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను.
”ఆ ఒక్కటీ అడక్కు” లో నా పాత్ర పేరు సిద్ధి. నా పాత్ర చాలా స్వేఛ్చగా వుంటుంది. అన్నీ ప్లాన్‌ చేసి, నిబంధనలు పెట్టుకొని- అందులోనే బతకడం తనకి ఇష్టం వుండదు. కథానాయకుడి పాత్ర నా పాత్రకు భిన్నంగా వుంటుంది. తను అన్నీ ప్లాన్‌ ప్రకారం వుంటారు. ఈ రెండు పాత్రల మధ్య మంచి కాన్ఫిక్టు వుంటుంది. అదే సమయంలో మంచి ఎట్రాక్షన్‌ వుంటుంది. కథ పెళ్లి అనే అంశం చుట్టూ ఉంటూ అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ”ఆ ఒక్కటీ అడక్కు” కథ, కాన్సెప్ట్‌ బ్యూటీఫుల్‌గా వుంటుంది.
ఈ పాత్ర చేయడం సవాల్‌గా అనిపించలేదు. ఎందుకంటే, నేను కూడా ఫ్రీ ఫ్లోలోనే వుంటాను. నాకు చాలా కనెక్ట్‌ అయిన పాత్ర ఇది. దర్శకుడు కథ చెప్పినపుడు కంటెంట్‌ చాలా నచ్చింది. ఈ రోజుల్లో అందరికీ అవసరమయ్యే కంటెంట్‌ ఇది. ‘జాతిరత్నాలు’లో మంచి హ్యుమర్‌ వున్న పాత్ర చేశాను. అయితే ఈ సినిమాలో కామెడీ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. పరిస్థితుల నుంచి పుట్టే హాస్యం వుంటుంది. ఇందులో కామెడీ చాలా నేచురల్‌గా పుడుతుంది. ఇందులో కంటెంట్‌ ప్రేక్షకులని సహజంగా నవ్విస్తుంది.
నరేష్‌ గారితో పని చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌. షూటింగ్‌ చాలా సరదాగా జరిగింది. నరేష్‌ గారి కామెడీ టైమింగ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారు. ఇందులో చాలా హిలేరియస్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ వుంటుంది. దర్శకుడు మల్లి గారు నాకు బౌండ్‌ స్క్రిప్ట్‌ ఇచ్చారు. అది నాకు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. అలాగే కథ గురించి చాలా చర్చించేవారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన అందరి సలహాలూ తీసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. సినిమా షూటింగ్‌ అంతా ఫన్‌గా జరిగింది.
ఇందులో పెళ్లి గురించిన అంశాలు చూస్తే.. ఫర్ఫెక్ట్‌ వైఫ్‌, ఫర్ఫెక్ట్‌ హుస్బెండ్‌, అంటూ చాలా సెలెక్టివ్‌గా మారిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు పెళ్లిళ్లకి, ఇప్పటి పెళ్లిళ్లకి చాలా మార్పులు వచ్చేశాయి. మ్యాట్రీమొనీ సైట్స్‌లో ఎలా డీల్‌ చేస్తారనే అంశంతో పాటు, పెళ్లికి సంబంధించిన అనేకాంశాలు ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించారు. రాజీవ్‌ చిలక గారు చాలా పాషన్‌ వున్న నిర్మాత. సినిమాని ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. వారి నిర్మాణంలో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.
కొత్తగా ‘మత్తువదలరా 2’ చేస్తున్నాను. గోపి దర్శకత్వంలో ‘భగవంతుడు’ అనే సినిమాలు చేస్తున్నాను. అలాగే ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. కొన్ని తమిళ.,మలయాళం కథలు కూడా వింటున్నాను.

జననం : మే 28, 1998
బంజారాహిల్స్‌, హైదరాబాద్‌
జాతీయత : భారతీయురాలు
నివాసం : హైదరాబాద్‌, తెలంగాణ, భారతదేశం
మతం : ముస్లిం

➡️