ఎన్నికల సిత్రాలు

Mar 28,2024 14:24 #Poetry
tdp campaign against ycp govt

ఎన్నికల వేళ

చిత్ర విచిత్రాలు

గెలుపు కోసం

గారడీ విద్యలు.

 

ఏపెత్తు ఎజెండాల జెండాలు

సందు గొందుల్లో

రంగు రంగుల తోరణాలు.

 

అక్కడక్కడా

ఇంద్రజాల పన్నాగాలు

కొన్ని చోట్ల

బుజ్జగింపు పర్వాలు.

 

చిరునవ్వుల

చిట్లింపుల ధోరణులు

వాగ్దానం

ఊహకందని మర్మాలు.

 

ఎన్నికల సిత్రాలు

వీధి ముచ్చట్లు

ఎటు చూసినా

ఓటు నోటు కేకలు.

 

పతాకాలతో

పథకాల రెపరెపలు

ప్రచారంతో

ఆశల కోటలు.

 

మాటలతో

నమ్మకాల ముసుగులు

నడకలతో

ఓదార్పు యాత్రలు.

 

నేనున్నాననే

భరోసాల మెరుపులు

ఎటు చూసినా

పైపై మెరుగులు.

ఎన్నికల కాలం

నడిసొచ్చే కుర్చీలు

అంతటా

పరిగెత్తే పార్టీలు.

 

– నరెద్దుల రాజారెడ్డి

సెల్‌ : 9666016636

➡️