అందరినీ కాదు సుమా!

Apr 28,2024 08:59 #Kavitha, #Sneha

మండే చెట్టు నుండి
పక్షులు మాయమైనట్లు
మనిషి దేహం నుండి
ద్వేషపు జ్వాలలు రగులుతుంటే..
మరో మనిషి దరి చేరలేడు
రోళ్లు పగిలే ఎర్రని అగ్గిలో కాళ్ళ కింద
కాసిని నీళ్లుచల్లి స్థానం కల్పించినట్లు!
జావకారిన చద్ది దోసిటపెట్టి
ఆకలి తీర్చినట్లు!
నిద్రలేమికి జాగారమనే పేరుపెట్టి
దైవభక్తితో జీవించినట్లు!
చెప్పుకునే గొప్పలన్నీ
నాలుగు గోడల మధ్య,
నీ అంతరంగం
నిన్ను ప్రశ్నించనంత వరకే!
నీలో దాతృత్వం పరిమళించినట్లు,
కొందరిని భ్రమింపజేయగలవు…
అందరినీ కాదు సుమా…!
యధార్థ వాది – లోక విరోధి.

పద్మజా రామకృష్ణ . పి
9491830278

➡️