రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి – పెరిగిన మతోన్మాద శక్తుల ప్రమాదం

  • మూడు రాష్ట్రాల్లో పభుత్వ వ్యతిరేక వెల్లువ

రెట్టించిన పట్టుదలతో పోరాడాలి

మితవాద బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు రెట్టించిన పట్టుదలతో పోరాడాల్సిన అవసరాన్ని ఈ నాలుగు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ”ప్రజలు వారి తీర్పును ఇచ్చారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారం చేజిక్కించుకోగా, తెలంగాణాలో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) నుండి కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంది. జీవనోపాధి వంటి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి, భారత రిపబ్లిక్‌ లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు లౌకిక శక్తులు తమ కృషిని రెట్టింపు చేయాలి.

– సీతారాం ఏచూరి, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి

సుపరిపాలనకే ఓటు

ప్రజలకు సుపరిపాలనను, అభివృద్ధిని అందించాలన్నది బిజెపి లక్ష్యం, దానికే ప్రజలు ఓటు వేశారు. తిరుగులేని మద్దతునందించిన ప్రజలకు కృతజ్ఞతలు. వారి సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తాం. పార్టీ అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు. – ప్రధాని నరేంద్ర మోడీ

ఆ మూడు రాష్ట్రాలో ఓటమి నిరాశపరిచింది

‘బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఓటమి తనను నిరాశపరిచింది. తాత్కాలికంగా ఎదురైన ఎదురుదెబ్బలను అధిగమించి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా వేదిక భాగస్వామ్య పక్షాలతో కలిసి ఐక్యంగా పోరాడేందుకు కృషి చేస్తాం. – మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు

➡️