ఊపిరితిత్తులను దెబ్బతీసిన కోవిడ్‌

Feb 20,2024 10:17 #covid, #damaged, #lungs

ముంబయి : కోవిడ్‌ బారినపడిన యూరోపి యన్లు, చైనీయులతో పోలిస్తే భారతీయుల్లోనే ఊపిరితిత్తులు ఎక్కువగా దెబ్బతిన్నాయని వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజి అధ్యయనంలో తేలింది. వారు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి సంవత్సర కాలానికి పైగా పట్టింది. కొందరిలో జీవితాంతం ఈ సమస్య కొనసాగవచ్చు. అధ్యయనంలో భాగంగా 207 మందిని పరీక్షించారు. దేశంపై కోవిడ్‌ మహ మ్మారి తొలిసారి విరుచుకుపడినప్పుడు నిర్వ హించిన ఈ అధ్యయనం వివరాలను పిఎల్‌ఒ ఎస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. ఊపిరితిత్తుల పనితీరుకు (ఎల్‌ఎఫ్‌టి)కు సంబంధించిన పరీక్షలో 44% మంది ఊపిరితిత్తులపై కోవిడ్‌ ప్రభావం పడిందని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని వైద్యులు తెలిపారు. 35% మందిలో పరిమిత స్థాయిలో లోపాలు కన్పించాయని వెల్లూరు కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ డిజె క్రిస్టొఫర్‌ చెప్పారు. ఏ విధంగా చూసినా భారతీయ రోగులపై ప్రభావం దారుణంగా పడిందని తెలిపారు. నాలుగు నుంచి ఐదు శాతం మందిలో మాత్రం జీవితకాలం ఈ సమస్య ఉంటుందని నానావతి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సలిల్‌ బెంద్రే చెప్పారు. ?

➡️