ఈ ఏడాది భారీగా ఐఎఎస్‌ల ఖాళీలు – ఉద్యోగ విరమణ చేయనున్న 15 మంది

Mar 6,2024 11:15 #15, #IAS, #people, #this year, #vacancies

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఈ ఏడాది రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఎఎస్‌ ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడనున్నాయి. పలువురు అధికారులు ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఈ పరిస్థితి ఏర్పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నురచి డిసెంబర్‌ వరకు ఏకంగా 14 మంది ఐఏఎస్‌ అధికారులు రిటైర్‌ కానున్నుట్లు సమాచారం. మే నెలాఖరు నురచి ఏర్పడనున్న కొత్త ప్రభు త్వానికి ఈ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల స్థాయి అధికారులు ఉరడగా, వారిలో జవహర్‌రెడ్డి సిఎస్‌గా ఉన్నారు. మరో సీనియర్‌ అధికారి సుమితా దావ్రా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఈ జాబితాలో నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, పూనం మాలకొరడయ్య, రజత్‌ భార్గవ, కె.ప్రవీణ్‌కుమార్‌, బి.రాజశేఖర్‌, గోపాలకృష్ణ ద్వివేది ఈ ఏడాదిలోనే ఉద్యోగ విరమణ చేయనున్నారు. వీరు కాకుండా ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల స్థాయి అధి కారులు మరో తొమ్మిది మంది కూడా జాబితాలో ఉన్నారు. వీరిలో ప్రశారతి ఆరధ్రాకు కేటాయిరచబడినా ఇప్పటికీ తెలంగాణలోనే పనిచేస్తున్నారు. మరో అధికారి శివశ్రీనివాస్‌ గత నెల్లోనే ఉద్యోగ విరమణ చేశారు. ఇక బి.శ్రీధర్‌, గిరిజా శంకర్‌ ముఖ్య కార్యదర్శుల హౌదాలో, హెచ్‌.అరుణ్‌ కుమార్‌, ధనుంజయరెడ్డి కార్య దర్శుల హౌదాలో, పి.కోటేశ్వరరావు, వెరకట రమణారెడ్డి, సుబ్బారావు ఇతర స్థాయిలో పదవీ విరమణ చేయనున్నారు.

పాలనపై ప్రభావం

               ఇలా ఒక్కసారిగా 15 మంది సీనియర్‌ ఐఏఎస్‌లు రిటైర్‌ అవుతురడడంతో దాని ప్రభావం పాలనపై పడుతురదని అరటున్నారు. వీరి స్థానంలో ముఖ్య కార్యదర్శులుగా ఉన్న వారికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభిరచినప్పటికీ, కిరద స్థాయిలో మళ్లీ కొరత పెరుగుతురదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త ఐఏఎస్‌ల కేటాయిరపులను పెరచాలని కోరేరదుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోరది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేటాయిరపులు పెరచాలని రెరడు తెలుగు రాష్ట్రాలు కోరినప్పటికీ, ఆరధ్రాకు పెద్దగా పెరుగు దల కనిపిరచలేదని అధికారులు చెబుతున్నారు. అరదుకే తాజా పరిణామాల నేపథ్యంలో ఈసారైనా ఎక్కువ మందిని కేటాయిరచేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోరది.

➡️