రేపటి నుంచి రంజీట్రోఫీ ఫైనల్‌

Mar 9,2024 22:30 #Sports

ముంబయి: రంజీట్రోఫీ 2023-24 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వాంఖడే స్టేడియంలో ఆదివారం నుంచి జరగనుంది. 41సార్లు ఈ టైటిల్‌ను ముద్దాడి ముంబయితో మూడుసార్లు టైటిల్‌ను నెగ్గిన విదర్భ జట్టు ఫైనల్లో తలపడనుంది. రంజీట్రోఫీలో ముంబయి జట్టుకు తిరుగులేదు. ఆ జట్టు ఫైనల్‌కు చేరిన వాటిలో 10సార్లు మినహా… మిగిలిన అన్ని సందర్భాల్లోనూ టైటిల్‌ను ముద్దాడింది. ఈ సీజన్‌లో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌ాఎలో విదర్భ జట్టు, ఎలైట్‌ గ్రూప్‌-బిలో ముంబయి జట్టు అగ్రస్థానాలో నిలిచాయి. విదర్భ జట్టు క్వార్టర్‌ఫైనల్లో కర్ణాటకను, సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను చిత్తుచేయగా.. ముంబయి జట్టు క్వార్టర్స్‌లో బరోడాను, సెమీస్‌లో తమిళనాడు చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకొచ్చింది. దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో జాతీయ జట్టు ఆటగాళ్లంతా తప్పనిసరిగా ఆడాల్సిందేనని బిసిసిఐ హుకుం జారీ చేసిన దృష్ట్యా స్టార్‌ ఆటగాళ్లంతా ఆయా జట్ల తరఫున బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. విదర్భ జట్టులో ఉమేశ్‌ యాదవ్‌ మినహా.. స్టార్‌ ఆటగాళ్లు పెద్దగా లేరు. ఇక ముంబయి జట్టులో రహానే, పృథ్వీ షా, సర్ఫరాజ్‌, శ్రేయస్‌, ధవల్‌ కులకర్ణి, శార్దూల్‌ ఠాకూర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లున్నారు.

జట్లు..

విదర్భ: అక్షయ్ వాడ్కర్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), జితేశ్‌ శర్మ(వికెట్‌ కీపర్‌), అధర్వ తైదే, ధృవ్‌ షోరే, ఫయాజ్‌ ఫజల్‌, కరణ్‌ నాయర్‌, మోహిత్‌ కాలే, సంజరు రఘునాథ్‌, శుభం భద్రీప్రసాద్‌, యష్‌ రాథోడ్‌, ఆదిత్య సర్వతే, అమన్‌ మోఖాడే, హర్‌ష దూబే, లలిత్‌ యాదవ్‌, సిద్ధేష్‌ వాత్‌, ఆదిత్య ఠాకరే, అక్షరు వాఖరే, దర్శన్‌ నల్కండే, రజనీశ్‌, ఉమేశ్‌ యాదవ్‌, యష్‌ ఠాకూర్‌.

ముంబయి: అజింక్యా రహానే, జితేంద భట్కల్‌, అర్మాన్‌ జాఫర్‌, భూసేన్‌ లల్వాని, జే బిస్తా, పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యాంశ్‌, సువేద్‌, అమోల్‌, ముషీర్‌ ఖాన్‌, సాగర్‌, నిక్షమ్‌, ములానీ, శివమ్‌ దూబే, తనుష్‌ కోటియన్‌, ఆకాశ్‌, హార్దిక్‌, ప్రసాద్‌, ఆదిత్య, అధర్వ, దీపక్‌ శెట్టి, ధవల్‌ కులకర్ణి, మాట్కర్‌, వికాస్‌, హిమాన్షు, కొఠారి, మోహిత్‌, రాయిస్టన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సిల్వెస్టర్‌, తుషార్‌ దేశ్‌పాండే.

➡️