స్వైటెక్‌, ఓస్టాపెంకో ఔట్‌..

Jan 20,2024 22:15 #Sports

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. టాప్‌సీడ్‌, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత ఇగా స్వైటెక్‌ అనూహ్యంగా మూడోరౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. శనివారం జరిగిన మూడోరౌండ్‌ పోటీలో పోలండ్‌కు చెందిన స్వైటెక్‌ 6-3, 3-6, 4-6తో అన్‌సీడెడ్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన నొస్కోవా చేతిలో ఓడింది. మరో పోటీలో 18వ సీడ్‌ అజరెంకా(రష్యా) 6-1, 7-5తో 11వ సీడ్‌, ఒస్టాపెంకో(లాత్వియా)ను చిత్తుచేయగా.. ఇతర పోటీల్లో 12వ సీడ్‌ క్యూ జెంగ్‌ 6-4, 2-6, 7-6(10-8)తో వాంగ్‌(చైనా)ను, అన్‌సీడెడ్‌ యాస్టెన్సు(ఉక్రెయిన్‌) 6-2, 2-6, 6-1తో 27వ సీడ్‌ నవర్రో(అమెరికా)ను చిత్తుచేసి ప్రి క్వార్టర్స్‌కు చేరారు.ప్రి క్వార్టర్స్‌కు మెద్వదెవ్‌, అల్కరాజ్‌.. పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి 2వ సీడ్‌, స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్‌ 3వ సీడ్‌ మెద్వదెవ్‌(రష్యా) ప్రవేశించారు. శనివారం జరిగిన మూడోరౌండ్‌లో అల్కరాజ్‌ 6ా1, 6ా1, 1ా0 ఆధిక్యతలో ఉండగా ప్రత్యర్ధి షంగ్‌(చైనా) గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. మరో పోటీలో మెద్వదెవ్‌ 6ా3, 6ా4, 6ా3తో 27వ సీడ్‌ అగర్‌ అలియాస్సిమ్‌(కెనడా)పై సునాయాసంగా నెగ్గాడు. మరో పోటీలో 13వ సీడ్‌ డిమిట్రోవ్‌(బల్గేరియా) అనూహ్యంగా అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ చేతిలో ఓడాడు. మరో పోటీలో 5వ సీడ్‌ జ్వెరేవ్‌ 6-2, 7-6(7-4), 6ా2తో మిఛెల్సన్‌(అమెరికా) చిత్తుచేయగా.. డిమిట్రోవ్‌ 7-6(7-3), 4-6, 2-6, 6-7(6-8)తో ఎన్‌ బోర్గెస్‌(పోర్చుగల్‌) చేతిలో ఓడాడు. మరో పోటీలో 19సీడ్‌ సి. నొరీ(బ్రిటన్‌) 6-4, 6-7(7-9), 6ా4, 6ా3తో 11వ సీడ్‌ రూఢ్‌(డెన్మార్క్‌)ను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. ఇతర పోటీల్లో 9వ సీడ్‌ హుర్‌క్రాజ్‌(పోలండ్‌), 21వ సీడ్‌ హాంబర్ట్‌(ఫ్రాన్స్‌)పై గెలుపొందగా.. 14వ సీడ్‌ టామీ పాల్‌ ఐదుసెట్ల హోరాహోరీ పోరులో అన్‌సీడెడ్‌ క్రీడాకారుడు కెక్‌మనోవిక్‌(క్రొయేషియా) చేతిలో పోరాడి ఓడాడు. ఇక పురుషుల డబుల్స్‌ రెండోరౌండ్‌ పోటీలో భారత్‌కు చెందిన ఎన్‌ బాలాజీ జంట ఓటమిపాలైంది. బాలాజీ-కార్నియా(రొమేనియా) జంట 3-6, 3-6తో 10వ సీడ్‌ అరెవాలో (సాల్విడార్‌)- పావిక్‌(క్రొయేషియా) చేతిలో వరుససెట్లలో ఓడారు.

➡️