రుతురాజ్‌ గైక్వాడ్‌ 98

Apr 28,2024 23:32 #Sports

అర్ధ సెంచరీతో మెరిసిన డార్లీ మిచెల్‌
చెన్నై సూపర్‌కింగ్స్‌ 212/3
చెన్నై : రుతురాజ్‌ గైక్వాడ్‌ (98, 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. డార్లీ మిచెల్‌ (52, 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) సైతం అర్థ సెంచరీతో రాణించటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. శివం దూబె (39, 20 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు), ఎం.ఎస్‌ ధోని (5 నాటౌట్‌, 2 బంతుల్లో 1 ఫోర్‌) ఆకట్టుకున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, జైదేవ్‌ ఉనద్కత్‌ రాణించారు.
చెపాక్‌ పిచ్‌పై టాస్‌ నెగ్గిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. మంచు ప్రభావం ఉండే పిచ్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శనే చేశారు. పవర్‌ప్లేలో 50 పరుగులు చేసిన సూపర్‌కింగ్స్‌ ఆ తర్వాత జోరు కొనసాగించింది. ఓపెనర్‌ అజింక్య రహానె (9) విఫలమైనా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (98), డార్లీ మిచెల్‌ (52) రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 బంతుల్లోనే గైక్వాడ్‌ అర్థ సెంచరీ సాధించగా.. డార్లీ మిచెల్‌ సైతం ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. శివం దూబె నాలుగు సిక్సర్లతో అలరించగా.. ఆఖర్లో ఎం.ఎస్‌ ధోని ఓ బౌండరీతో చెపాక్‌కు ఊర్రూతలూగించాడు.

➡️