రితికా సింగ్‌కు గాయాలు

Dec 4,2023 20:16 #New Movies Updates

గురు సినిమాతో తెలుగువారికి దగ్గరైంది రితికా సింగ్‌. సౌత్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. కింగ్‌ ఆఫ్‌ కొత్త మూవీలో ఐటం సాంగ్‌లో నటించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ 170వ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో రితికా సింగ్‌ గాయపడినట్లు తెలుస్తోంది. చేతులపై అక్కడక్కడా గీసుకుపోయి రక్తం వస్తున్న ఫోటోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘అక్కడ ఉన్న ఓ గాజు అద్దం వల్లే ఇదంతా జరిగింది. బట్‌, ఇట్స్‌ ఓకే.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు క్షణాల్లో జరిగిపోయేవాటిని మనం ఆపలేము. నేను పట్టు కోల్పోవడం వల్లే ఇలా జరిగింది’ అని వీడియో రిలీజ్‌ చేసింది. ఈ గాయం వల్ల షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నట్లు తెలిపింది. దీన్నుంచి కోలుకున్న తర్వాతే తిరిగి సెట్స్‌లో పాల్గొంటానని పేర్కొంది.

➡️