జూన్‌ 2 తర్వాత ఎపికి కేటాయించిన భవనాలు స్వాధీనం

May 15,2024 23:08 #CM Revanth Reddy, #Telangana
  •  ఉన్నత స్థాయి సమీక్షలో తెలంగాణ సిఎం రేవంత్‌

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ జూన్‌ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులను తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో పునర్విభజనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఉన్నత స్థాయి సమీక్షలో సిఎం అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని, జూన్‌ రెండు నాటికి రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు మొదలుకుని ఆస్తులు, అప్పుల పంపిణీ వరకు పెండింగ్‌ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

➡️