పది విద్యార్థులకు నగదు బహుమతులు

ప్రజాశక్తి – పెనుమంట్ర
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వెలగలేరు విద్యార్థి స్కూల్‌ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని స్కూల్‌ కరస్పాండెంట్‌ పడాల వెంకటరెడ్డి, సుధారాణి తెలిపారు. 582 మార్కులతో మండలంలో ద్వితీయ, మార్టేరు టౌన్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన పెసల లక్ష్మీనాగసహస్రకు రూ.పది వేలు, 580 మార్కులతో మండంలో తృతీయ స్థానం, టౌన్‌లో ద్వితీయ స్థానంలో నిలిచిన యళ్ల మోహనప్రియకు రూ.ఐదు వేలు, 577 మార్కులతో మండలంలో చతుర్ధ స్థానం, టౌన్‌లో తృతీయ స్థానంలో నిలిచిన దొమ్మేటి అమృత వర్షిణికి రూ.ఐదు వేలు నగదు బహుమతులు అందించారు. ఏడుగురు విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారని, ఐదుగురు 550పైగా మార్కులు సాధించారని తెలిపారు. పరీక్ష రాసిన 20 మందిలో 20 మంది ఉత్తీర్ణత సాధించిన ఏకైక విద్యాసంస్థగా నిలిచిందని తెలిపారు. విద్యార్థులను స్కూల్‌ కరస్పాండెంట్‌ పడాల వెంకటరెడ్డి, సుధారాణి, ఉపాధ్యాయులు అభినందించారు.పట్టుదలతో విజయాలు సొంతం వీరవాసరం :పట్టుదలతో విద్యనభ్యసిస్తే విజయాలు దానంతట అవే వరిస్తాయని ఎంఆర్‌కె జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు జుత్తిగ శ్రీనివాస్‌ అన్నారు. ఇటీవల పది పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను శుక్రవారం స్యూల్‌ యాజమాన్యం సత్కరించింది. 572 మార్కులతో మండల స్థాయిలో ద్వితీయ స్థానం, స్కూల్‌ పరిధిలో ప్రథమ స్థానం సాధించిన మద్దాల జోత్స్న, 557 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన యాళ్ల సాయిశ్రీజ్యోతి, 545 మార్కులతో తృతీయ స్థానం సాధించిన మల్లువలస కీర్తిలను స్కూల్‌ యాజమాన్యం సత్కరించింది. అనంతరం మున్నలూరి వెంకట సత్యనారాయణ విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో శనివారపు ప్రసాద్‌, వై.వెంకటేశ్వరరావు, లక్ష్మీపార్వతి, పద్మజరాణి, పి.సుమిత, రవికుమార్‌ పాల్గొన్నారు.

➡️