విజయవాడ కానూరులోని కర్మాగారంలో అగ్ని ప్రమాదం

Mar 26,2024 10:44 #factory, #Fire Accident, #Vijayawada

కానూరు (విజయవాడ) : విజయవాడ నగర శివారు కానూరులో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా పొగ దట్టంగా కమ్ముకుంది. ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అనుమతులు లేకుండా ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️