నేడు,రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఉత్తరకోస్తా, యానాం. దక్షిణకోస్తా, రాయలసీమల్లో ఈనెల 25, 26 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశంఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఉపరితర అవర్తనం కొనసాగుతుండటం ఈ వర్షాలకు కారణమని తెలిపింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది.

➡️