ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం

Dec 3,2023 01:29

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
పోరాటాల ద్వారానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతామని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి యు చెంచయ్య అన్నారు. స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం జరిగిన మండల కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎస్‌ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఓపిఎస్‌ అమలు చేయాలని కోరారు జిఓ 117ను రద్దు చేసి ఉపాద్యాయ, విద్యార్ధి నిష్పత్తిని తగ్గించి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరారు. హైస్కూలులో 3, 4, 5తరగతుల విలీనాన్ని ఉప సంహరించుకుని ప్రాధమిక పాఠశాలలు కొనసాగించాలని సూచించారు. అమ్మ ఒడిని ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్ధులకే పరిమితం చేయాలని అన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల ఒత్తిడిని తగ్గించాలని కోరారు. పిఎఫ్‌, ఏపిజిఎల్ఐ, సరండర్‌ లీవులు, డిఏ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశానికి షేక్‌ మస్తాన్‌వలి అధ్యక్షత వహించారు. సమావేశంలో రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పిడపర్తి పేరిరెడ్డిని, పదోన్నతిపై వెళ్ళిన కె నాగేశ్వరరావు, స్నేహలతను సత్కరించారు. అనంతరం గౌరవాధ్యక్షులుగా పేర్ని సత్యనారాయణ, అధ్యక్షులుగా ఎస్‌ సమత, సహ అధ్యక్షులుగా ఏ శ్రీమన్నారాయణ, ఎం శాంతిప్రియ, ప్రధాన కార్యదర్శిగా షేక్‌ మస్తాన్‌వలి, కోశాధికారిగా ఎం మాధవ, జిల్లా కౌన్సిలర్స్‌గా కెఎం విజయకుమారి, పి చంద్రారెడ్డి, సిహెచ్‌ శివరామకృష్ణ, కార్యదర్శులుగా కెజెఆర్‌ కుమారి, టి శ్రీనివాసరావు, కె వీరారెడ్డి, ఎం శ్రీనివాసులు, వివి సుబ్బారావు, వివిధ కమిటీల కన్వీనర్స్‌గా కె సురేష్‌, జె అనిత, పి పావని, ఎస్‌ పద్మావతి, జె గోపికృష్ణ, కె పుష్పావతి, కె సునీల్‌ కుమార్‌, వి సుబ్బారావు ఎన్నికయ్యారు.
చిన్నగంజాం : యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గం శనివారం ఎన్నుకున్నారు. స్థానిక జెడ్‌పి బాలికల ఉన్నత పాఠశాల జరిగిన సమావేశంలో అధ్యక్షులుగా మెట్టు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా షేక్ నాయబ్ రసూల్ ఎన్నికయ్యారు.

➡️