యుఏఈని ముంచెత్తిన వరదలు -ఒమన్‌లో భారీ వర్షాలకు 18మంది మృతి

Apr 17,2024 08:41 #18, #floods, #heavy rains, #people died, #UAE

యుఏఈ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒమన్‌లో కురిసిన ఎడతెరిపిలేని వానలకు 18మంది మృతి చెందారు. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రోడ్లు, వీధులన్నీ జలదిగ్బంధమయ్యాయి. భారీ వరదలకు దుబారు వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు వరదలో చిక్కుకుపోయాయి. ఓవైపు వరదలు, మరోవైపు తీవ్రగాలుల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. యూఏఈలో మొత్తం పాఠశాలలను మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు, కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధులు, రోడ్లపై ఉన్న వరద నీటిని ట్యాంకర్ల సహాయంతో తొలగిస్తున్నారు. మరోవైపు యూఏఈ పొరుగునున్న ఒమన్‌లో కూడా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లు, వీధులు మొత్తం నీటితో నిండిపోయాయి. ఈ భారీ వర్షాలకు 18 మృతి చెందారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని ఒమన్‌ అత్యవసర నిర్వహణ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. బహ్రెయిన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా దేశాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి.

➡️