2023లో 120 మంది జర్నలిస్టుల హత్య 

international journalists federation on journalist murder

 

  • అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్‌ వెల్లడి

న్యూయార్క్‌: 2023 సంవత్సరంలో ప్రపంచ వ్యాపితంగా 120 మంది జర్నలిస్టులు హత్యగావించబడ్డారని అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఐఎఫ్‌జె) వెల్లడించింది. వీరిలో 68 శాతం (75 మంది) ఇజ్రాయిల్‌ హంతక దాడుల్లో చనిపోయినవారే. ఇందులో 75 మంది పాలస్తీనా జర్నలిస్టులు కాగా, నల్గురు ఇజ్రాయిల్‌, ముగ్గురు లెబనీయులు ఉన్నారు. 2022లో 68 మంది, 2021లో 47 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఐరాస మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబరు 10న జాబితా విడుదల జేసిన నాటికి 94 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. గడచిన మూడు వారాల్లో మరో 26 మంది హత్యకు గురయ్యారు. జర్నలిస్టుల భద్రత, స్వతంత్రతను కాపాడాలని ఐరాస చేసిన తీర్మానాలకు అన్ని దేశాల ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని ఐఎఫ్‌జె కోరింది.

➡️