ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

ఔరంగాబాద్ : మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని ఓ వస్త్ర దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్టు సమాచారం. మిగతావారి ఆచూకీ లభించాల్సి ఉంది. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. కేసు నమోదు చేసుకున్నామని.. విచారణలో అగ్నిప్రమాదానికి గల కారణమేమిటో తెలుస్తుందని తెలిపారు.

➡️