ఇడి సమన్లపై స్పందించిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ :   ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) జారీ చేసిన ఎనిమిదో సమన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. సమన్లను ‘చట్టవిరుద్ధం’ గా పరిగణించినప్పటికీ, మార్చి 12 తర్వాత తేదీన తాను విచారణకు హాజరవుతానని వెల్లడించారు. తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో కేజ్రీవాల్‌ పేర్కొన్నట్లు ఆప్‌ వర్గాలు తెలిపాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేజ్రీవాల్‌ విచారణకు హాజరవుతారని కేజ్రీవాల్‌ తెలిపింది. అయితే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించేందుకు ఇడి అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని ఇడి ఎనిమిదోసారి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్‌ సమన్లకు స్పందించకపోవడంపై ఇటీవల ఇడి కోర్టులో ఫిర్యాదు చేసింది. న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. కేజ్రీవాల్‌ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

➡️