విమానం ఆలస్యమైందని ఫిర్యాదు – ప్రయాణీకుడికి రూ.85 వేల పరిహారం

ముంబయి : విమానం ఆలస్యమైందని ఓ ప్రయాణీకుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు … ఆ వినియోగదారుడికి రూ.85 వేల పరిహారాన్ని చెల్లించాలని ఎయిర్‌ ఇండియాకు ఫైన్‌ వేసింది. 2018లో బ్యాంకాక్‌ నుంచి ముంబయి బయలుదేరాల్సిన విమానం ఒక రోజు ఆలస్యమైంది. సంస్థ నిర్లక్ష్యానికి తాను మానసిక వేదనకు గురయ్యానని, ఒక వర్క్‌ డే ను కోల్పోయానని మోహిత్‌ నిగమ్‌ (33) ప్రయాణీకుడు ఫిర్యాదు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. అతనికి రూ.85,000 పరిహారం చెల్లించాలని ఎయిర్‌ ఇండియాకు స్పష్టం చేసింది.

➡️