బెంగాల్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

Apr 29,2024 10:12 #Bengal, #campaign, #cpm, #extensively

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ దక్షిణ కోల్‌కతా సిపిఎం అభ్యర్థి సైరా షా హలీమ్‌కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. జాదవ్‌పూర్‌లో సృజన్‌ భట్టాచార్యకు మద్దతుగా ర్యాలీ చేశారు. ఈ ర్యాలీల్లో ఎర్రజెండాలు, దివిటీలు పట్టుకుని యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ తదితరులు అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలకు హాజరయ్యారు.

➡️