అగ్నిపథ్‌తో యువతకు అన్యాయం : రాష్ట్రపతికి ఖర్గే లేఖ

న్యూఢిల్లీ : సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌తో యువతకు అన్యాయం జరుగుతోందని… వారికి న్యాయం చేయాలని కోరుతూ … కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు లేఖ రాశారు. లేఖలో … సాయుధ దళాల్లో శాశ్వత ఉపాధి కోరుకునే యువతకు అగ్నిపథ్‌తో అన్యాయం జరుగుతోందని తెలిపారు. వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రపతిని కోరారు. సాయుధ బలగాల్లో శాశ్వత నియామకాలను ఆపేయడంతో దాదాపు 2 లక్షల మంది యువత భవిష్యత్తులో అనిశ్చితి నెలకొందన్నారు. ఇది అనేక ఆత్మహత్యలకు దారి తీసిందని ఖర్గే ఆరోపించారు. యువత సమస్యలు ఎదుర్కొంటుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు. వారికి న్యాయం చేయాలని రాష్ట్రపతి ముర్మును కోరారు.

➡️