గండె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కల్పనా సోరెన్‌ నామినేషన్‌

రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న గండె అసెంబ్లీ నియోజక వర్గం నుంచి జెఎంఎం తరపున బరిలోకి దిగిన ఆమె సోమవారం గిరిదV్‌ాలో ఎన్నికల అధికారి వద్ద తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌ సిఎం చంపయీ సోరెన్‌, జార్ఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేష్‌ ఠాకూర్‌, మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్‌ వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన భర్త హేమంత్‌ సోరెన్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆరెస్టు చేయించిందని అన్నారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం)కు చెందిన ఎమ్మెల్యే సర్పరాజ్‌ అహ్మద్‌ డిసెంబర్‌లో తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది.

➡️