కృష్ణానగర్‌పై జాతీయస్థాయి దృష్టి

Apr 30,2024 02:40 #2004 Elections, #West Bengal

పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆకర్షి స్తున్న నియోజక వర్గాల్లో నదియా జిల్లాలోని కృష్ణా నగర్‌ ఒకటి. పార్ల మెంట్‌లో ప్రశ్నలు లేవనె త్తడంలో నైతికత ప్రదర్శిం చలేదన్న ఆరోప ణలతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన టిఎంసి ఎం.పి. మహువా మొయిత్రా మళ్లీ ఇక్కడ పోటీ చేస్తున్నారు. లోక్‌సభ నుంచి బహిష్కృతురాలైన వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమెను కృష్ణానగర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మమత ప్రారంభించారు. బిజెపి అభ్యర్థిగా రాజ కుటుంబానికి చెందిన అమృతా రారు పోటీ చేస్తున్నారు. బెంగాల్‌ నవాబ్‌ సిరాజ్‌ ఉద్‌ దౌలాకు వ్యతిరేకంగా బ్రిటిష్‌ వారితో కలిసి కుట్ర పన్నిన దివంగత రాజా కృష్ణచంద్ర రారు వారసత్వం అమృతకు ఉందని టిఎంసి ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఆందోళన చెందవద్దని ప్రధాని నరేంద్ర మోడీ అమృతారారుకి ఫోన్‌ చేసి నచ్చచెప్పినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం సాది (సిపిఎం) కృష్ణానగర్‌లో పోటీ చేయడంతో టిఎంసి, బిజెపిల లెక్కలు తప్పే అవకాశం ఉందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. రైతులు, సాధారణ కూలీలు ఉండే కృష్ణానగర్‌లో దాదాపు సగం మంది మైనారిటీ వర్గాలకు చెందినవారే. సిపిఎం అభ్యర్థి సాదీ ప్రచారం జోరుగా సాగుతోంది. రోడ్‌ షోలతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి చోటా వేలాది మంది పాల్గొన్న ర్యాలీలు కనిపిస్తున్నాయి. కాగా ఈ నియోజకవర్గంలో నాల్గవ దశలో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి.

➡️