దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు..

Mar 5,2024 10:56 #Bengaluru, #NIA raids

చెన్నై : బెంగళూరు కేఫ్‌ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం తమిళనాడు, కర్ణాటక సహా దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. లష్కరే తోయిబా దక్షిణ భారత కమాండర్‌ తడియంతవిడ నసీర్‌ బెంగళూరు సెంట్రల్‌ జైలులో కొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చాడని, వారిలో చాలా మంది ప్రస్తుతం జైలు నుంచి బయటపడ్డారనే సమాచారం మేరకు ఎన్‌ఐఏ విచారణ జరుపుతోంది. రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఈ యువకులపై దృష్టి సారించిందని, వారిలో కొందరికి తమిళనాడులోని కడలూరు, చెన్నైలతో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. దీంతో అనుమానాస్పద వ్యక్తు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితులకు నిషేధిత సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.

➡️