Odisha: 4 లోక్‌సభ స్థానాలకు బరిలో 39 మంది అభ్యర్థులు

భువనేశ్వర్‌ : ఒడిశాలో నాలుగు లోక్‌సభ సీట్లకు గాను 39 మంది అభ్యర్థులు, 28 అసెంబ్లీ స్థానాలకు గాను 266 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల అధికారులు శుక్రవారం తెలిపారు. కలహండి, నబరంగ్‌పూర్‌, కోరాపుట్‌, బెర్హంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 28 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనుంది. 39 మంది అభ్యర్థులు 75 నామినేషన్‌ పత్రాలు, 266 మంది 483 పత్రాలు సమర్పించారని, ఒక అభ్యర్థి అనేక నామినేషన్‌ పత్రాలను సమర్పించారని ఆ అధికారి తెలిపారు. బెర్హంపూర్‌ లోక్‌సభ స్థానానికి అత్యధికంగా 24 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. బెర్హంపూర్‌ అసెంబ్లీ సీటుకి గరిష్టంగా 30 నామినేసన్‌ పత్రాలు దాఖలు కాగా, నబరంగ్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఝరిగావ్‌కి కేవలం ఐదు పత్రాలు దాఖలైనట్లు తెలిపారు. ఏప్రిల్‌ 26న నామినేషన్‌ పత్రాల పరిశీలన, ఏప్రిల్‌ 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా పేర్కొన్నారు.

ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. నాలుగు స్థానాలకు మే 13 అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిగిలిన స్థానాలకు మే 20, మే 25, జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

➡️