Om Birla -రెండు సార్లు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రముఖులు

Jun 26,2024 23:55 #Om Birla, #Speaker of Lok Sabha

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. దీంతో ఆయన వరుసగా రెండో సారి ఆ పదవిని అధిష్టించారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత వరుసగా రెండు సార్లు లోక్‌సభ స్పీకర్‌ చేసిన వ్యక్తులు నలుగురు ఉన్నారు. అందులో ఇద్దరు తెలుగువారు ఉండటం విశేషం. మొదటి సారిగా ఎం.ఎ అయ్యంగార్‌ (చిత్తూరు) (1956-57, 1957-62) వరుసగా రెండు సార్లు లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు. ఆ తరువాత బలరామ్‌ జాఖర్‌ 1980-85, 1985-89ల్లోనూ, తరువాత జిఎంసి బాలయోగి (అమలాపురం) 1998-99, 1999-2002 లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండు సార్లు పని చేశారు. వీరిలో ఎం.ఎ అయ్యంగారు, జిఎంసి బాలయోగి తెలుగువారు. అయితే వరుసగా చేయకపోయిన మూడో తెలుగు వ్యక్తి నీలం సంజీవ్‌ రెడ్డి (1967-69, 1977-77 ) రెండు సార్లు లోక్‌సభ స్పీకర్‌ అయ్యారు.

➡️