Lok Sabha polls: కేవలం 8శాతం మంది మహిళా అభ్యర్థులే..

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల మొదటి రెండు దశల్లో మొత్తం 2,823 మంది అభ్యర్థులలో కేవలం 8 శాతం మాత్రమే పోటీపడ్డారు. ఇది దేశంలో పాతుకుపోయి లింగవివక్షను ప్రతిబింబిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు, నిపుణులు పేర్కొన్నారు. మహిళా సాధికారత గురించి రాజకీయ నేతలు చెప్పేవన్నీ బూటకమని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 19న మొదటి దశ ఎన్నికలు జరగగా, ఏప్రిల్‌ 26న రెండవ దశ ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో మొత్తం 1,625 మంది అభ్యర్థులు పోటీపడగా, రెండవ దశలో 1,198 మంది బరిలోకి దిగారు. వీరిలో మొదటి దశలో 135 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, రెండవ దశలో 100 మంది బరిలో నిలిచారని, మొత్తం మీద రెండు దశల్లో కలిపి 235 మంది మహిళా అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. అయితే ఆ సంఖ్య రాష్ట్రంలోని మొత్తం అభ్యర్థుల్లో కేవలం 8శాతం మాత్రమే.

మొదటి దశలో 135 మంది మహిళా అభ్యర్థులలో, తమిళనాడులో అత్యధికంగా 76 మంది మహిళా అభ్యర్థులతో మొదటి స్థానంలో నిలవగా,   24 మంది మహిళా అభ్యర్థులతో కేరళ రెండవ స్థానంలో నిలిచింది.

➡️