ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాహుల్‌ ధ్వజం

Apr 10,2024 15:48

న్యూఢిల్లీ  :    పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చిన ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని విభజించాలనుకున్న శక్తులతో ఎవరు చేతులు కలిపారో అందరికీ తెలుసునని రాహుల్‌ గాంధీ బుధవారం పేర్కొన్నారు. రాజకీయ వేదికలపై నుండి ‘అబద్ధాలను చిమ్మడం’తో చరిత్ర మారదని స్పష్టం చేశారు.    2024 లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు. ఒకవైపు భారతదేశాన్ని ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలని కోరుకునే కాంగ్రెస్‌, ప్రజలను విభజించే బిజెపిల మధ్య పోరు అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

దేశాన్ని విభజించాలనుకునే శక్తులతో ఎవరు చేతులు కలిపి, వారిని ఎవరు బలోపేతం చేశారో, అలాగే ఎవరు దేశ స్వాతంత్య్రం, ఐక్యత కోసం పోరాడారనేదానికి చరిత్రే సాక్ష్యమని అన్నారు.

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటీష్‌ వారితో చేతులు కలిపింది ఎవరని ప్రశ్నించారు. దేశంలోని జైళ్లు కాంగ్రెస్‌ నేతలతో నిండిపోయినపుడు, విభజన శక్తులతో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారని నిలదీశారు.

➡️