ఎన్నికల్లో 9 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి!

May 6,2024 02:38 #2024 election, #workers

న్యూఢిల్లీ : దేశంలో ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఏప్రిల్‌ 19వ తేదీన మొదలై.. జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఇప్పటివరకూ రెండు దశల ఎన్నికలు జరిగాయి.  ఈ నేపథ్యంలో దేశంలో వివిధ దశల్లో జరిగే ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ అధికారులు, క్లర్క్స్‌, సెక్యూరిటీ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ కోఆర్డినేటర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ వంటి ఉద్యోగాల ద్వారా దాదాపు 9 లక్షల మంది యువత తాత్కాలికంగా ఉపాధి పొందుతున్నారని వర్క్‌ ఇండియా సిఇఓ, కో ఫౌండర్‌ నీలేష్‌ డంగర్వాల్‌ పేర్కొన్నారు. అయితే ఇది తాత్కాలికమేనని.. దేశంలో జాబ్‌ మార్కెట్‌పై కొంతమేర మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సిఇఓ కార్తీక్‌ నారాయణ్‌ అన్నారు. ఈ సమయంలో ఉద్యోగాలు పొందేవారి జీతాలు రూ. 15,000 నుంచి రూ. 40,000 వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

➡️