ఏడుగురు కాశ్మీరీ విద్యార్థులపై యుఎపిఎ అభియోగాలు

Nov 28,2023 10:25 #Jammu and Kashmir, #UAPA

 

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ పోలీసులు ఏడుగురు కాశ్మీరీ విద్యార్థులపై యుఎపిఎ కింద కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ సందర్భంగా పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేసినందుకు వారిపై ఈ కేసు నమోదైంది. వీరు గండేర్‌బల్‌లోని షేర్‌ ఎ కాశ్మీర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో చదువుతున్నారు. అదే వర్శిటీలో చదువుతున్న పంజాబ్‌కి చెందిన మరో విద్యార్ధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. విద్యార్థులపై యుఎపిఎ అభియోగాలను ఉపసంహరించాలని జమ్ము కాశ్మీర్‌ విద్యార్థి సమాఖ్య కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరింది.

➡️