తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

Mar 2,2024 07:59 #AP, #inter exams

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇంటర్మీడియట్‌ పరీక్షలు తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 4,89,714 మంది దరఖాస్తు చేసుకోగా, 4,67,002 మంది హాజరయ్యారు. వొకేషనల్‌కు 46,662 మంది దరఖాస్తు చేసుకోగా, 39,003 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,559 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా మాల్‌ ప్రాక్టీసులు జరగలేదని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

➡️