ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉంది: నిమ్మగడ్డ రమేశ్‌

Mar 23,2024 17:35 #nimmagadda ramesh, #speech

విజయవాడ: గతంలో తిరుపతి ఉపఎన్నికలో 35 వేల దొంగ ఓట్లు వేశారని,ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉందని సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ ఓట్లతో గెలిచి భారీ మెజార్టీ వచ్చిందని వైసిపి నేతలు గొప్పలు చెప్పారని విమర్శించారు. ఓటర్‌ ప్రొఫైల్‌ అనేది వాలంటీర్లు ఎప్పుడో సేకరించి పెట్టారన్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సభకు వెళ్లారని ఒక వ్యక్తిని చంపడం సరికాదన్నారు. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు.

➡️