డ్రగ్స్‌ రవాణాదారులను శిక్షించాలి – ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నిరసన

Mar 23,2024 22:35 #sfi nirasana, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :విశాఖకు తీసుకువచ్చిన డ్రగ్స్‌ రవాణాదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం కోట జంక్షన్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు శనివారం నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలోకి 25వేల కిలోల డ్రగ్స్‌ ప్రవేశిస్తే అది ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరి కాదా? అని ప్రశ్నించారు. మాదకద్రవ్యాల బారి నుంచి యువతను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌, బి.హరీష్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయి , మాదకద్రవ్యాల వాడకం రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిందని, నిర్మూలించాల్సిన ప్రభుత్వాలే రవాణాదారులకు అండగా నిలుస్తూ వారికి సహకరించడం దుర్మార్గమన్నారు. ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వాలు పోర్టులను ప్రయివేటు పరం చేయడం మొదలుపెట్టాయో అప్పటి నుంచి నిషేధిత పదార్థాలు రాష్ట్రంలోని ప్రవేశిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి. రాము, జిల్లా ఉపాధ్యక్షులు జె .రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️