బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే : విజయశాంతి

Nov 18,2023 15:40 #speech, #vijayasanti

హైదరాబాద్‌: బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే , వారు తెర ముందు విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత, సినీ నటి విజయశాంతి విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ అవినీతిని కక్కిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజరును తొలగించవద్దని తాము కోరినట్లు తెలిపారు. అయితే బండి సంజరును మార్చిన తరువాత బీజేపీ గ్రాఫ్‌ పడిపోయిందని అన్నారు. కేసీఆర్‌ నాటిన విత్తనం బీజేపీలో సంజరును మార్చేసిందని విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఉన్న నేత అసైన్డ్‌ భూములు ఏమయ్యాయి, కేసు ఏమైందని ప్రశ్నించారు,
సీఎం కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే ఆ పార్టీలోకి వెళ్లానన్న విజయశాంతి.. ఏళ్లు గడచినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మేడిగడ్డ కూలిపోతుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆధారాలు ఉండి కూడా కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాలేదన్నారు.

➡️