విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

Mar 8,2024 14:25 #Fire Accident, #nijamabad

నిజామాబాద్‌: నిజామాబాద్‌ లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రముఖ దైవ క్షేత్రం శంభునిగుడి ఆలయం వద్ద అహ్మద్‌ ఎస్టేట్‌ అనే భవనంలో ప్రమాదవశాత్తు కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక పోర్షన్‌లో మంటలు చెలరేగాయి. శివరాత్రి ఉత్సవాలకు అంత సిద్ధమైన వేల ఆలయం ఎదుట గల భవనంలో మంటలు చెలరేగి రెండు గదులు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. సంబంధిత పోర్షన్‌లో ఉన్న గ్యాస్‌ సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది తొలగించి మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదం లేడీస్‌ టైలర్‌ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతంలో జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానికులు తెలిపారు. షాప్‌ నిర్వాహకురాలు డ్వాక్రా సంఘం సభ్యురాలని తెలిసింది. చీరల అమ్మకం తాలూకుతో పాటు నిల్వ ఉంచిన ఐదు లక్షల కరెన్సీ నోట్లు అగ్ని ప్రమాదంలో కొన్ని పూర్తిగా మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి. అవి చలామణి కావు అని నిర్ధారించారు. ఆస్తి నష్టం అంచనాను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

➡️