సముద్రపు ఒడ్డున భారీ పాము కళేబరం

Feb 28,2024 12:38 #Snake, #Visakha
A huge snake carcass on the beach

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని పాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

➡️