17thDay: అంగన్వాడీల పోస్ట్ కార్డు ఉద్యమం

anganwadi strike 17th day konaseema

వేతనాల బాధను వేదనతో రాస్తున్నాం- సిఎంకు అంగన్‌వాడీల పోస్టుకార్డు ఉద్యమం

17వ రోజుకు చేరిన సమ్మె

ప్రజాశక్తి – యంత్రాంగం :ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే అదనంగా రూ.వెయ్యి పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోస్టుకార్డుపై తమ డిమాండ్లను రాసి సిఎం ఇంటి అడ్రస్‌కు రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు పోస్టు చేశారు. వేతనాల బాధను వేదనతో రాస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం చేపట్టారు.ఉమ్మడి తిరుపతి జిల్లా పోస్టుబాక్స్‌ల వద్ద క్యూలు కట్టి మరీ ఉత్తరాలను పోస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ సంఘీభావం తెలిపారు. విజయనగరం, గజపతినగరంలో మెడకు చీరలు బిగించుకుని నిరసన తెలిపారు. జామిలో గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు అందిస్తూ, అక్కడే పొర్లు దండాలు పెట్టి ఆందోళన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు, పార్వతీపురంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. నెల్లూరులోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలకు సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ సంఘీభావం తెలిపారు. సమ్మె శిబిరానికి వెళ్తూ మృతి చెందిన వనమ్మ కుటుంబానికి రూ.70వేలు ఆర్థికసాయాన్ని ప్రకటించారు. కర్నూలులో కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ నుండి వందలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. కొత్తపల్లిలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ను అడ్డుకుని తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. పాలకోడేరులో సమ్మెకు యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి, మొగల్తూరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. వీరవాసరంలో సమ్మె శిబిరం టెంట్లను గురువారం రాత్రి కూలదోశారని, కారకులపై చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీలు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో మోకాళ్లపై నిలబడి, చెవులు, కళ్లు మూసుకుని వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉంగుటూరులో వినూత్నంగా ‘అంతన్నడు.. ఇంతన్నాడో జగనన్న నట్టేటా ముంచేశాడో’ అంటూ పేరడీ పాటలు, భజన చేస్తూ నిరసన తెలిపారు. విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రికి పోస్ట్‌ కార్డు క్యాంపెయిన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్‌ మీదుగా ఆర్‌డిఒ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ బైఠాయించారు. సబ్బవరంలో 1902 టోల్‌ ప్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలను తెలియజేశారు. అల్లూరి జిల్లా చింతూరు మండల పర్యటనకు వచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిని చింతూరులో అడ్డుకున్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.ఉమ్మడి కృష్ణా, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబమ్మకు శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు.

రాజంపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గురువారం పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ప్రతి అంగన్వాడీ మహిళ గురువారం ఉత్తరాలు రాసి తపాలా ద్వారా విజయవాడ లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పంపించారు.
తిరుపతి జిల్లా గూడూరులో పోస్ట్ కార్డు ల ద్వార నిరసన తెలుపుతున్న అంగన్వాడి కార్యకర్తలు

గోకవరంలో అంగన్వాడీల పోస్ట్ కార్డ్ నిరసన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి పోస్ట్ ద్వారా పోస్ట్ కార్డులను పంపిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు హెల్పర్లు

చాగల్లులో  17వ  రోజుకి చేరిన అంగన్వాడి దీక్షలు

కారంచేడు మండలం వద్ద అంగన్వాడి సమ్మెలో భాగంగా గురువారంనాడు ముఖ్యమంత్రి జగన్ కి ఉత్తరాలు వ్రాస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు
గణపవరంలో ఉత్తరాలతోనిరసనతెలుపుతున్నఅంగన్వాడిలు
అల్లూరిజిల్లా పెదబయలులో అంగన్వాడీల పోస్ట్ కార్డు ఉద్యమం
రాజధాని ప్రాంతం తుళ్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గురువారం చెవిలో పువ్వుతో నిరసన
కడప జిల్లా వేంపల్లెలో అంగన్వాడిల సమస్యను నువ్వేనా ఆలకించంటూ ఎద్దుకు వినతిపత్రం

anganwadi workers strike 17th day prakasam

ప్రకాశం జిల్లా : కనీస వేతనం 26000/-ఇవ్వాలని, అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, చివరి నెల జీతంలో సగం జీతం పెన్షన్ గా ఇవ్వాలని, తదితర డిమాండ్లతో కూడిన పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రికి పిసిపల్లి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో పంపడమైనది.

anganwadi workers strike 17th day eluru

ఏలూరు జిల్లా : అంగన్వాడీల సమ్మె 17వ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద పోస్ట్ కార్డులతో నిరసన ప్రదర్శన

anganwadi workers strike 17th day ntr

ఎన్టీఆర్ జిల్లా :  అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇబ్రహీంపట్నంలోని మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడి కార్యకర్తలు, సిఐటియు నాయకులు ముట్టడి కార్యక్రమం చేపట్టారు.

anganwadi workers strike 17th day kadapa

  • కోతికి వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ కార్యకర్తలు

కడప జిల్లా- చాపాడు :  గత 17 రోజులుగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు చాపాడులో గురువారం కోతికి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తల మండల నాయకులు సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదన్నారు.అందుకే కోతికి తమ బాధలను తెలియజేస్తున్నామన్నారు.చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు జగన్ వేతనాలు పెంచుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

anganwadi workers strike 17th day

గుంటూరు జిల్లా : అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరుకుంది. స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో సిఐటియు, సిపిఎం పార్టీలు తమ పూర్తి మద్దతును తెలిపాయి, పలు సంఘాల ప్రతినిధులు అంగన్వాడీలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం నిర్వహించిన సమ్మెలో సీఎం జగన్మోహన్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా తమ డిమాండ్లను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ కన్ రాజ్యలక్ష్మి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పట్టణ కార్యదర్శి వై ఈశ్వరి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎవిఎన్ కుమారి, పి పావని విజయలక్ష్మి, రంగ పుష్ప, అంజనీ కుమారి, ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.

 

అనంతపురం జిల్లా చిలమత్తూరులో పోస్టల్ కార్డు ఉధ్యమం చేపడుతున్న అంగన్వాడీలు…

 

తిరుపతి జిల్లా గూడూరులో పోస్ట్ కార్డుల ద్వార నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు

 

రంపచోడవరంలో అంగన్వాడీ వర్కర్స్ 17 వరోజు నిరసన దీక్ష

అల్లూరి జిల్లా :  రంపచోడవరంలో నినాదాలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్

anganwadi workers strike 17th day alluri

అల్లూరి జిల్లా : పెదబయలు ప్రజాశక్తి అంగన్వాడీ ప్రత్యేక సంచిక జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు బోండా సన్నిబాబు, మహిళా అధ్యక్షురాలు కౌసల్య, అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు టి రాజమ్మ గురువారం ఉదయం నిరాహార దీక్ష శిభిరంలో ఆవిష్కరణ చేసారు. నాయకులు సమక్షంలో ₹2, రూపాయలకు విక్రహించి 106 రూపాయలు శంకర్ కు ఫోన్ పే చేయడమైనది.

anganwadi workers strike 17th day atp

అనంతపురం జిల్లా చిలమత్తూరులో పోస్టల్ కార్డు ఉధ్యమం చేపడుతున్న అంగన్వాడీలు

anganwadi workers strike 17th day

కడప జిల్లా : దువ్వూరు అంగన్వాడి కార్యకర్తలు ప్రభుత్వ సముదాయాల వద్ద పోస్ట్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

➡️