నేడు శ్రీకాకుళం జిల్లాలో సిఎం పర్యటన

Dec 14,2023 10:09 #CM YS Jagan, #srikakulam, #Visit
cm jagan visit srikakulam

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పలాసలో నూతనంగా నిర్మించిన కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, కంచిలిలో వైఎస్‌ఆర్‌ సుజలధార మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం కాశీబుగ్గ రైల్వే మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. పలాసలో కిడ్నీ ఆస్పత్రి నుంచి హెలీప్యాడ్‌ వరకు, అక్కడ్నుంచి బహిరంగ సభ నిర్వహించే రైల్వే క్రీడా మైదానం వరకు సిఎం జగన్‌ రోడ్‌ షోగా వెళ్లే బస్సుతోపాటు కాన్వారుతో బుధవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. హెలీప్యాడ్‌ నుంచి రోడ్డుకు ఇరువైపులా భారీస్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

➡️