కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి

Dec 3,2023 15:19 #cm kcr

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి సంచలన విజయం సాధించారు. సీఎం కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డిలో పోటీ చేసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి రెండవ స్థానంతో సరిపెట్టుకోగా..కేసీఆర్‌ మూడవ స్థానంలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో బరిలో నిలిచిన విషయం తెలిసిందే. గజ్వేల్‌లో మాత్రం విజయం దిశగా కేసిఆర్‌ దూసుకుపోతున్నారు.

➡️