35 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం : మంత్రి అంబటి రాంబాబు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మిచౌంగ్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను సంబంధిత కమిటీలతో శనివారం నుండి అంచనాలు వేయిస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 35 శాతానికిపైగా పంట దెబ్బతిన్న రైతులే పరిహారానికి అర్హులని చెప్పారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో కంటే రూ.2 వేలు అదనంగా నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. వరి, పత్తి, మిరప, శనగ, కూరగాయలు, అరటి, మామిడి పంటలకు, మూగ జీవాలకు నష్టం అంచనాలను వేయాలని అధికారులకు సూచిం చారు. రైతులు అధైర్యపడొద్దని, పంటలను జాగ్రత్తగా నష్టం అంచనాలు వేయించు కోవాలని సూచించారు. కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కమిటీ వేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివా సరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

➡️