ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Feb 7,2024 10:37 #AP assembly meetings

ప్రజాశక్తి-అమరావతి : అసెంబ్లీలో మూడో రోజు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమయంలో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే.. తీవ్ర గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని.. రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, పోలవరం కట్టలేక పోయిన ప్రభుత్వం అంటూ.. నినాదాలు చేశారు. దీంతో సభ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేశారు. దీంతో స్పీకర్ ఆఫీస్ ఎదుట టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అలాగే స్పీకర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని అసెంబ్లీ మార్షల్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడే బైటాయించి నినాదాలు చేస్తున్నారు. ఇదిల ఉండగా సభలోపల కూడా గందరగోళంగా మారింది. మిగిలి ఉన్న సభ్యులు రైతుల సమస్యలపై చర్చ జరపాలని ఆందోళన చేస్తుండగా.. గందరగోళ పరిస్థితుల నడుమే.. పలు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు.

➡️