దీక్ష శిబిరం తొలగింపుపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

cpm on aganwadi arrest

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా దౌర్జన్యంగా విజయవాడలో దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది.  అంగన్వాడీలపై లాఠీచార్జి చేయటాన్ని ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేసింది. నెల్లూరు జిల్లా సంగం మండలంలో  మరణించిన అంగన్వాడీ కార్యకర్తకు సిపిఎం శ్రద్ధాంజలి ఘటిస్తున్నదని తెలిపింది.

➡️