వేరుశెనగకాయల గోదాములో అగ్నిప్రమాదం

గుత్తి (అనంతపురం) : అనంతపురంలోని వేరుశెనగకాయల గోదాములో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గుత్తి రోడ్డు వేరుశెనగ కాయల గోదాముకు నిప్పంటుకోవడంతో అగ్నికీలలు చెలరేగాయి. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు. కాగా గోదాములో వేరుశనక్కాయల మూటలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని నియంత్రించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

➡️