గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు.. విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ గంటపాటు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. హైదరాబాద్‌, చెన్నై ఎయిర్‌పోర్టుల నుంచి బయల్దేరిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే ఆ సమయంలో వాతావరణం అనుకూలించలేదు. పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి అనుమతి రాకపోవడంతో ఆ రెండు విమానాలను వాటి పైలట్లు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. పరిస్థితి అలాగే కొనసాగడంతో హైదరాబాద్‌ ఇండిగో సర్వీసును తిరిగి వెనక్కి పంపించారు. కాసేపటి తర్వాత మంచు ప్రభావం తగ్గడంతో చెన్నై నుంచి వచ్చిన విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అనుమతి ఇచ్చారు.

➡️