పసుమర్రు రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : చంద్రబాబు

May 15,2024 10:26 #chandrababu, #road accident, #tribute

అమరావతి : పసుమర్రు రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. బుధవారం ఉదయం దీనిపై చంద్రబాబు ఓ ప్రకటనను విడుదల చేశారు. పల్నాడు జిల్లా, పసుమర్రి సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్‌ ఢకొీని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మఅతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మఅతుల కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

➡️