ఎన్నికల్లో ఓడితే నా శవాన్ని చూస్తారు : టిడిపి మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి

Apr 1,2024 08:48 #dead body, #election, #TDP

ప్రజాశక్తి- మార్కాపురం (ప్రకాశం జిల్లా) : ‘ఎన్నికల్లో నేను పోటీ చేసేందుకు చంద్రబాబు అవకాశం కల్పించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నన్ను గెలిపించుకోవాలి. లేనిపక్షంలో నా శవాన్ని చూడాల్సి వస్తుంది’ అని టిడిపి మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఆవేశంగా మాట్లాడారు. చంద్రబాబు సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పై మేరకు వ్యాఖ్యలు చేశారు.

➡️